కోనసీమ: నీటి సంఘాల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు ఆయన పి.గన్నవరంలోని క్యాంప్ కార్యాలయం వద్ద నియోజకవర్గ కూటమి నాయకులతో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల వివరాలను ఎమ్మెల్యే సేకరించారు.