VSP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆదివారం విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి, ఎన్నికల హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆక్షేపించారు.