ATP: కార్మికులకు మున్సిపల్ శాఖనే వేతనాలు చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు గత సమ్మె హామీ ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామికి వినతి పత్రం అందజేశారు.