NTR: నున్న గ్రామంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల వద్ద నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.