W.G: గంజాయి, నాటుసారా, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. పాలకొల్లు విశ్వ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించారు. గంజాయి, ఇతర డ్రగ్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు.