నల్గొండలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలలో చిట్యాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. స్థానిక ఆక్స్ఫర్డ్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు సౌరవ్ మహాకుడ్, చింతకాయల విద్య, విక్రాంత్, సాయి ప్రణీత్‌లు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ పెద్ది నరేందర్, పీఈటీ లింగస్వామి వీరిని అభినందించారు.