TG: MLC కల్వకుంట్ల కవితపై BRS మహిళా నాయకులు మండిపడ్డారు. TRS పార్టీని BRSగా మార్చడం తనకు ఇష్టం లేదని కవిత ఇప్పుడు మాట్లాడుతున్నారు.. మరి ఆరోజున తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చారని గొంగిడి సునీత ప్రశ్నించారు. నిజామాబాద్లో ఓడిపోతే చూడలేక KCR ఎమ్మెల్సీ ఇచ్చారని గుర్తుచేశారు. పార్టీలో ప్రాధాన్యత లేకుండానే రెండుసార్లు MLC పదవి ఇచ్చారా? అని నిలదీశారు.