ఆర్థిక కష్టాల సమయంలో పీఎఫ్ ఖాతా నుంచి బీమా ప్రీమియంను చెల్లించేందుకు EPFO వెసులుబాటు కల్పిస్తోంది. యాక్టివ్ పీఫ్ అకౌంట్ ఉన్న వారు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని చెప్పింది. అయితే బీమా పాలసీ చందాదారుడి పేరు మీదే ఉండాలని తెలిపింది. జీవిత భాగస్వామి లేదా పిల్లల మీద ఉంటే పాలసీ ప్రీమియంలు, ఇతర ప్రైవేటు బీమా ప్రీమియంలను చెల్లించడానికి వీలు ఉండదు.