KMR: దోమకొండ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ చైతన్య సుధ కోరారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె సూచించారు. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు.