కర్నూలు SP క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని DIG, జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు స్వీకరించారు.