MNCL: ఆరోగ్యకరమైన పంటలే లక్ష్యంగా రైతులు సేంద్రియ సాగు వైపు దృష్టి పెట్టాలని DAO సురేఖ అన్నారు. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలో సోమవారం ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ సాగు ద్వారా భూసారాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి తోడ్పాటును అందించవచ్చన్నారు.