KMR: ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రానికి సమీపంలోని ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో కొత్త హంగులు సంతరించుకుంటోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చెరువు కట్టకు ఇరువైపులా వంతెనలు నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెరువు కట్టను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఆధునీకరణ పనులకు రూ.3కోట్లు మంజూరు చేసింది. పనులు చురుకుగాసాగుతున్నాయి.