AP: కాకినాడ జిల్లా యానాం వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడి వలకు 24 కిలోల పెద్ద పండుగప్ప చేప చిక్కింది. సాధారణంగా చెరువుల్లో పండుగప్ప చేపలు 6 కిలోల వరకు మాత్రమే పెరుగుతాయి. కానీ నదిలో ఉండటం వల్ల ఇది సాధారణ కంటే చాలా పెద్దగా పెరిగింది. ఇది చాలా రుచిగా, మాంసం మృదువుగా ఉంటుంది. ఈ అరుదైన చేపను రూ.16,000కి విక్రయించడం, స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.