NLR: కందుకూరులోని పామూరు రోడ్డులో త్యాగరాజ స్వామి గుడి ఎదురుగా ఉన్న మున్సిపాలిటీ షాపు మెట్లపై గుర్తు తెలియని ఒక వ్యక్తి డెడ్ బాడీ కనిపించింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకున్నది. చుట్టుప్రక్కల స్థానికులు ఆ డెడ్ బాడీని పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.