కృష్ణా: గుడివాడ ప్రముఖ న్యాయవాది కంభంపాటి రవిని గుడివాడ 11వ జిల్లా అదనపు కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రభుత్వం శుక్రవారం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఈ నెల 11వ తేదీన జీవోను విడుదల చేశారు. గతంలో కంభంపాటి రవి 2015 నుంచి 2021 వరకు ఇదే కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సమర్థవంతంగా సేవలందించారు.