KRNL: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద గ్రామీణ కూలీల నిమిత్తం అమలవుతుందని, అవినీతి, అక్రమాలు చేయడానికి కాదని డ్వామా పీడీ వెంకట రమణయ్య ఉపాధి సిబ్బందిని హెచ్చరించారు. పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏపీడీ లోకేశ్వర్ అధ్యక్షత సామాజిక తనిఖీ బహిరంగ సభ జరిగింది. ఉపాధిలో జరిగిన అవినీతి సొమ్ము రూ. 3,17,607 తక్షణమే రికవరీ చేయాలని ఆదేశించారు.