ATP: కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామంలో శుక్రవారం గొర్రె పిల్లల మందపై నక్క దాడి చేసింది. ఘటనలో 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన మహేంద్ర తన గొర్రెలను మోపు కోసం తోలుకెళుతూ పిల్లలను వేరు పరిచి ఇంటి సమీపంలోని దొడ్డిలో వదిలి వెళ్లాడు. ఈ ఘటన చోటు చేసుకోగా.. దీంతో దాదాపు రూ. 2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు.