VZM: డా. బీఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్య ద్వారానే అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చునని స్పష్టం చేశారు. దీనికి అంబేద్కర్ మహనీయుని జీవితమే ఉదాహరణ అన్నారు.