E.G: మార్వాడీలకు తాము వ్యతిరేకం కాదని రాజమండ్రి అభివృద్ధిలో వారు ఒక భాగమని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు వ్యాపారాలు చేసుకుంటూ మరోవైపు విరివిగా సేవా కార్యక్రమాలు చేసే మార్వాడీలను వ్యతిరేకించడం సరికాదని, ఈ విధానాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.