VSP: స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్ర స్థాయి అవార్డు రావడం తమ బాధ్యతను మరింత పెంచిందని విశాఖలోని ఎంవీపీ కాలనీ రైతుబజార్ ఎస్టేట్ అధికారి కె. వరహాలు అన్నారు. సోమవారం విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి అవార్డులు తమ విధి నిర్వహణ పట్ల మరింత బాధ్యత పెరిగేలా చేస్తాయన్నారు.