NLR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు వెంటనే వెనక్కి తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 28న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆమె శుక్రవారం ఆవిష్కరించారు.