GNTR: మంగళగిరిలో ఓ వ్యాపారిపై దౌర్జన్యం, బెదిరింపు కేసులో బండారు రవి అలియాస్ బక్క రవి అనే రౌడీషీటర్‌ను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిని జైలుకు తరలించినట్లు సీఐ వినోద్ కుమార్ బుధవారం తెలిపారు. రౌడీషీటర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. వారి ఆగడాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.