PLD: పెదకూరపాడు మండలంలో ప్రభుత్వం అందిస్తున్న నిత్యవసర సరుకులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి అని తహసీల్దార్ ధనలక్ష్మి తెలిపారు. మండలంలో ఈ కేవైసీ చేయించుకోని వారి లిస్టు విడుదల చేశారు. తమ సమీపంలోని రేషన్ డీలర్లను సంప్రదించి వీఎస్డబ్ల్యూఎస్ యాప్లో వేలిముద్ర వేసి ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. మార్చి 31 వరకే ఈ అవకాశం ఉందని తెలిపారు.