KDP: కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని మన గ్రోమోర్ సెంటర్కు యూరియా రాగానే, రైతులు ఉదయాన్నే చేరుకుని ఎరువుల కోసం వేచి చూస్తున్నారు. ఈ మేరకు పంపిణీ ఈ రోజు ప్రారంభమవుతుందని సమాచారం ఉండడంతో పడి గాపులు కాస్తున్నారు. కాగా, వర్షాల నడుమ సాగు వేగంగా సాగుతుండటంతో ఎరువుల అవసరం అధికమైంది. వచ్చిన స్టాకు త్వరగా అయిపోతుందని రైతులు ముందుగానే ఎరువుల దుకాణాల వద్దకు చేరుకున్నారు.