E.G: జిల్లాలో తుఫాన్ నేపథ్యంలో రద్దు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీస్లను పునరుద్ధరించినట్లు DPTO వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. అటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఇటు ఆర్టీసీ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బస్సు సర్వీసులను రద్దు చేశామన్నారు. తుఫాను తీరం దాటడంతో జిల్లాలో నడుస్తున్న 219 సర్వీస్లు నేటి నుంచి పూర్తిస్థాయిలో నడుస్తాయన్నారు.