CTR: పీవీకేఎన్ కళాశాలకు న్యాక్ “ఎ” గ్రేడ్ రావడం జిల్లా వాసులకు గర్వకారణమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల మరమ్మత్తుల విషయంలో నిధులు మంజూరు చేసిన కలెక్టర్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనేక మంది కళాశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారని, వీరంతా స్పందించి పీవీకేఎన్ కళాశాల పురోభివృద్ధికి సహకరించాలని కోరారు.