బాపట్ల మండలం అడవి పంచాయతీ పరిధిలోని సూర్యలంక బీచ్లో నీడ గొడుగులు, సామాన్లు భద్రపరిచే గది కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుందని పంచాయతీ అధికారులు తెలిపారు. ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు ముందుగా రూ.25,000 డిపాజిట్ చేయవలసి ఉంటుందని వెల్లడించారు.