ASR: కొయ్యూరు డిప్యూటీ ఎంపీడీవోగా లాలం సీతయ్య నియమితులయ్యారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా అనంతగిరిలో విధులు నిర్వహిస్తున్న ఆయనను ఉన్నతాధికారులు కొయ్యూరు డిప్యూటీ ఎంపీడీవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. గతంలో సీతయ్య ఉపాధి హామీ పథకం చింతపల్లి ఏపీడీగా విధులను నిర్వహించారు.