VZM: ఏపీఎస్పీ 5వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీ కమాండెంట్ వై. రవిశంకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. జనవరి 5న జరిగే ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు.