కోనసీమ: తుఫాన్ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఆర్టీసీ బస్సులను పలు మార్గాల్లో రద్దు చేసిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి కొన్నింటిని పునఃప్రారంభించారు. 66 సర్వీసులకు గాను 33 బస్సులు తిరిగాయి. గురువారం నుంచి యథావిధిగా అన్ని బస్సులు తిరుగుతాయని రావులపాలెం డిపో మేనేజర్ కుమర్ తెలిపారు.