ప్రకాశం: ఒంగోలులో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ రద్దు అవుతుందన్న వార్తలను సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఖండించారు. గత ప్రభుత్వం భవనాలు నిర్మించకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణమని గురువారం ఆయన ఆరోపించారు. రావు అండ్ నాయుడు కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తోందని ఆయన వివరించారు.