ప్రకాశం: మండల కేంద్రమైన హనుమంతునిపాడు శ్రీ సీతారామ, లక్ష్మణ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కనిగిరి శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించిన వేద పండితులు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.