GNTR: స్త్రీ సాధికారతే నిజమైన సమాజాభివృద్ధి అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శనివారం బ్రాడీపేట 2/14వ లైన్లోని శాంతినికేతన్ స్కూల్ నందు నూతన తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి వేదికపై సగం మంది మహిళలు సమానంగా ఉండే స్థాయికి మనం ఎదగాలి అని ఎమ్మెల్యే తెలిపారు.