VSP: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం ఆధ్వర్యంలో రాంనగర్లో బుధవారం పాదయాత్ర చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలని ప్రభుత్వానికి కార్పొరేటర్ గంగారావు డిమాండ్ చేశారు. చెత్త పైన పన్ను రద్దు చేస్తామని చెప్పి అధికారికంగా ఇంతవరకు రద్దు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.