అన్నమయ్య: మదనపల్లె మండలం కోళ్ల బైలు పంచాయితీలో మౌలిక వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో సమస్యలు పరిష్కరించాలంటూ స్థానిక ప్రజలతో కలసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్లు, త్రాగునీటి సమస్య, వీధిలైట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.