NDL: మహానందిలో ఈనెల 28వ తేదీన వివిధ అంశాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. లడ్డూ, పులిహోర కమీషన్ పద్ధతిన తయారు చేసే లైసెన్స్ హక్కు, నందీశ్వర కంకణాల సరఫరా, వివిధ రకాల ఫొటోస్ సరఫరా, రసీదు పుస్తకాల ముద్రణ, భక్తులకు అగరబత్తీలను విక్రయించేందుకు వేలాలు ఉంటాయన్నారు.