TPT: టీటీడీ అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి గురువారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీ ఆసుపత్రుల్లో ఉచిత సేవల కోసం ఆన్లైన్ బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేయాలని జీఎంఐటీ ఇంఛార్జ్ ఫణికుమార్ నాయుడును ఆదేశించారు. ఈ సమావేశంలో చీఫ్ పీఆర్వో డా.టీ.రవి పాల్గొన్నారు.