TPT: ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం అందింది. నిజామాబాద్‌కు చెందిన దాత కటకం శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి రూ.10 లక్షల విరాళ డిమాండ్ డ్రాప్ట్‌ను అందజేశారు. బీఆర్ నాయుడు దాతకు కృతజ్ఞతలు తెలుపుతూ.. అన్నప్రసాదం ద్వారా భక్తులకు నిత్యం సేవ చేసే కార్యక్రమానికి ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.