VZM: తుఫాన్ పరిస్థితిని తెలుసుకోవడానికి మాజీ CM వైయస్ జగన్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వర్చువల్గా పాల్గొన్నారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల పంట నష్టాన్ని తెలుసుకున్నామని అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చిన్న శ్రీను వివరించారు. అనంతరం నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని జగన్ సూచించారు.