కేసుల దర్యాప్తులో భౌతిక ఆధారాల సేకరణ అత్యంత కీలకమని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. శుక్రవారం రాత్రి అమలాపురం ఎస్పీ కార్యాలయం నుంచి జూమ్ ద్వారా ఆయన నేర సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత, వేగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ కేసులపై దృష్టి సారించాలన్నారు. సిబ్బంది బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.