అన్నమయ్య: మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె వద్ద శనివారం మధ్యాహ్నం స్కూటర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును ఓ వ్యక్తి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరడంతో స్థానికులు 108 అత్యవసర సర్వీసు ద్వారా మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.