SKLM: జిల్లాలో యూరియా కొరతపై వైకాపా నేతలు ఎందుకు గట్టిగా అడగడం లేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం టెక్కలి సమీపంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ పిలుపు ఇస్తేనే రోడ్డెక్కి నిరసనలు చేపడతారా అని ప్రశ్నించారు. జిల్లాలో ధర్మాన సోదరులు నోరు మెదపడం లేదని, అంతా కలిసే పనులు చేయించుకుంటారని ఆరోపించారు.