VZM: వేపాడ మండలం కుమ్మపల్లిలో గురువారం వెటర్నరీ డాక్టర్ గాయత్రి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో 7 పశువులకు గర్భాధారణ ఇంజక్షన్లు, 22 పశువులకు గర్భకోశ, సాధారణ చికిత్సలు నిర్వహించారు. శీతాకాలంలో పశువులు, జీవాల యాజమాన్యాలపై పాడి రైతులకు అవగాహన కల్పించారు.