ప్రకాశం: మార్కాపురం మున్సిపాలిటీ నూతన ఏఈ గా తిరుమలరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఆదినారాయణ సాధారణ బదిలీలలో భాగంగా వినుకొండకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.