బాపట్ల: జిల్లా శక్తి హెడ్ క్వార్టర్ టీం బాపట్ల ఉప్పరపాలెం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినులకు ఇవాళ గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో ఎస్సై అనిత మాట్లాడుతూ.. అనుకోని ప్రమాదం ఎదురైతే భయపడకుండా ‘డోంట్ టచ్ మీ’ అని గట్టిగా అరిచేలా తర్ఫీదు ఇచ్చారు. తాకకూడని ప్రదేశాలను బొమ్మల ద్వారా వివరించారు.