KKD: మొంథా తుఫాను డేంజర్ బెల్స్ మోగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. కంట్రోల్ రూమ్ల ఏర్పాటు, తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. కాకినాడ జిల్లాకుగాను ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్ కృష్ణ తేజకు బాధ్యతలు అప్పగించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.