KNRL: వేసవి కాలంలో గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పత్తికొండ సీహెచ్సీ సూపరింటెండెంట్, వైద్యాధికారిణి కల్పన సూచించారు. తరచూ చల్లటి నీరు తాగాలని, ఫ్రిడ్జ్ నీరు వాడకూడదన్నారు. మట్టి కుండలోని నీరు ఉపయోగించడం మంచిదని తెలిపారు. శరీరంలో నీటి లోపం రాకుండా హైడ్రేషన్ కాపాడుకోవాలని, తాజా పండ్లు, లిక్విడ్స్, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.