E.G: గోపాలపురం నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సూచించారు. గ్రామస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల సమగ్ర పరిరక్షణే తమ లక్ష్యమని పేర్కొన్నారు.