NTR: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వీరుళ్లపాడు మండలం, గూడెం మాధవరం ఫీల్డ్ అసిస్టెంట్ మన్నే సుధీర్ సస్పెన్షన్కు కలెక్టర్ డా.జి. లక్ష్మీశ బుధవారం ఆదేశాలిచ్చారు. గ్రామంలో వేతనదారులకు పనులు కల్పించడంలోనూ సగటు వేతనం విషయంలో, అనుమతి లేకుండా, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చారు.