కృష్ణా: దేశ శాంతి భద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తుందని, వారు సురక్షిత తీరం-సమృద్ధి భారత్ లక్ష్యంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ అభినందనీయమని జిల్లా కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో సముద్ర తీర సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.